News February 22, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

ఈ నెల 27న జరిగే కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల నిర్వహణకు జిల్లా స్థాయిలో పటిష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ జి.లక్ష్మీశా తెలిపారు. ఎన్నికల జనరల్ అబ్జర్వర్ వి.కరుణ.. నియోజకవర్గ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులతో శనివారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఏర్పాట్లను వివరించారు.
Similar News
News December 8, 2025
వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు

RBI <<18475069>>రెపో రేటును<<>> 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25% తగ్గించాయి. రెపో అనుసంధానిత రుణ రేటును PNB 8.35 నుంచి 8.10%కి, BOB 8.15 నుంచి 7.90%కి, BOI 8.35 నుంచి 8.10%కి సవరించాయి. హోం లోన్ రేట్లు 7.10%, కార్ లోన్ రేట్లు 7.45% నుంచి ప్రారంభమవుతాయని BOM తెలిపింది.
News December 8, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలపై శిక్షణ: డీఈవో

సంగారెడ్డి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలపై అధికారులకు మంగళవారం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మొదటి విడత శిక్షణకు హాజరుకాని అధికారులు తప్పనిసరిగా ఈ శిక్షణకు హాజరు కావాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 8, 2025
ముడతలు తగ్గించే ఫేస్ ప్యాక్

యవ్వనంగా కనిపించే చర్మం కోసం రసాయన ఉత్పత్తులకు బదులు ఇంట్లోని సహజ పదార్థాలను వాడితే చాలు. వాటిల్లో ఒకటే ఈ అరటిపండు ఫేస్ ప్యాక్. బాగా మగ్గిన అరటిపండును తీసుకొని కాస్త తేనె, బార్లీ పౌడర్ కలిపి పేస్ట్ చేయాలి. బార్లీకి బదులు బియ్యప్పిండి కూడా వాడొచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి అరగంట ఉంచిన తర్వాత కడిగేయాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేస్తే చర్మం యవ్వనంగా మారుతుంది.


