News February 26, 2025
ఎమ్మెల్సీ ఓటర్లకు సిద్దిపేట సీపీ సూచనలు

పట్టబద్రులు, టీచర్లు పోలీసుల సలహాలు, సూచనలు పాటించి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ అనురాధ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించామని, కావున గుంపులు గుంపులుగా తిరగవద్దని సీపీ సూచించారు.
Similar News
News September 18, 2025
SRPT: ‘సీఎంఆర్ లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలి’

సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మిల్లర్లు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సీఎంఆర్ గడువును NOV 12 వరకు పొడిగించిందని, మిల్లర్లు అందరూ సహకరించి గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆయన కోరారు. మిల్లులను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ సీఎంఆర్ పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు.
News September 18, 2025
ఆసియా కప్: UAE టార్గెట్ 147 రన్స్

ఆసియా కప్లో భాగంగా UAEతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 146/9 స్కోర్ చేసింది. ఫఖర్ జమాన్ హాఫ్ సెంచరీతో రాణించగా చివర్లో షహీన్ ఆఫ్రిది (29*) బౌండరీలతో స్కోర్ బోర్డును పెంచారు. UAE బౌలర్లలో జునైద్ 4, సిమ్రాన్జీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే యూఏఈ 20 ఓవర్లలో 147 రన్స్ చేయాలి. UAE గెలుస్తుందని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.
News September 18, 2025
ఇల్లంతకుంట: ఉపాధ్యాయుడిలా మారిన కలెక్టర్

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయుడిలా మారారు. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట మోడల్ స్కూలును బుధవారం ఆయన తనిఖీ చేశారు. కాసేపు ఉపాధ్యాయుడిలా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలను విద్యార్థులతో నిత్యం చదివించి రాయించాలన్నారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పాఠ్యాంశాలపై పట్టు వచ్చేలా పిల్లలకు బోధించాలన్నారు.