News February 26, 2025
ఎమ్మెల్సీ ఓటర్లకు సిద్దిపేట సీపీ సూచనలు

పట్టబద్రులు, టీచర్లు పోలీసుల సలహాలు, సూచనలు పాటించి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ అనురాధ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించామని, కావున గుంపులు గుంపులుగా తిరగవద్దని సీపీ సూచించారు.
Similar News
News March 22, 2025
మంత్రి పొన్నంను కలిసిన కరీంనగర్ సీపీ

కరీంనగర్ సీపీగా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన గౌస్ అలం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం మంత్రిని సీపీ కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు, ప్రజా భద్రతల రక్షణ దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను గురించి వారు చర్చించారు.
News March 22, 2025
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..!

కామారెడ్డి జిల్లాలో నమోదైన ఎండ ఉష్ణోగ్రత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూరు, నసురుల్లాబాద్, పిట్లంలో 38.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాల్వంచ, నిజాంసాగర్, రామారెడ్డి, బిచ్కుంద, రాజంపేట, బిక్కనూరు, కామారెడ్డి, గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో 37.7 ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఎండల తీవ్రత ఎక్కువవ్వడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News March 22, 2025
రేషన్ షాపుల్లో సన్నబియ్యం.. UPDATE

TG: పేదలకు రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి వేదిక ఖరారైంది. ఉగాది రోజున సూర్యాపేటలోని మట్టపల్లి ఆలయం నుంచి ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీని ద్వారా 2 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు 6కేజీల చొప్పున సన్నబియ్యం అందుకోనున్నారు. కాగా ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వనున్నారు.