News June 5, 2024
ఎమ్మెల్సీ కౌంటింగ్.. తీన్మార్ మల్లన్న ముందంజ..!

ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తరువాత స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. మొదటి ప్రాధాన్యత ఓట్లు రాకేష్ రెడ్డికి పెద్ద ఎత్తున పోల్ అయినప్పటికీ అవి చెల్లుబాటు కాలేదు. దీంతో రాకేష్ రెడ్డి కాస్త వెనుకబడినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News January 3, 2026
నేరాల నియంత్రణే లక్ష్యం: ఖమ్మం సీపీ సునీల్ దత్

ఖమ్మం జిల్లాలో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి, శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని సీపీ సునీల్ దత్ తెలిపారు. శనివారం ఆయన ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News January 3, 2026
ఖమ్మం బస్టాండ్లో బాదుడు.. నిబంధనలకు పాతర!

ఖమ్మం నూతన బస్ స్టేషన్లో తినుబండారాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్లాట్ఫారమ్లపై ఉన్న స్టాళ్లలో ఎంఆర్పీ నిబంధనలను గాలికి వదిలేసి, స్నాక్స్, వాటర్ బాటిళ్లను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. అధిక ధరలపై ప్రయాణికులు ప్రశ్నిస్తే నిర్వాహకులు దురుసుగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి, తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు కళ్లెం వేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
News January 3, 2026
ఖమ్మం ఆయుర్వేద ఆసుపత్రిలో మందులు నిల్!

ఖమ్మం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మందుల కొరతతో వెలవెలబోతోంది. మూడు నెలలుగా ఇక్కడ మందులు అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం వచ్చే రోగులు రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్నారు. పెద్ద సంఖ్యలో బాధితులు ఈ ఆసుపత్రిని ఆశ్రయిస్తుంటారు. వైద్యులు పరీక్షించి చీటీలు రాసిస్తున్నా, మందుల కౌంటర్లో నిల్వలు లేవని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మందుల సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.


