News April 7, 2025
ఎమ్మెల్సీ మల్క కొమురయ్యను అభినందించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మల్క కొమురయ్యను సోమవారం ఐటి పరిశ్రమ, వాణిజ్యం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అభినందించారు. కాగా, మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్యలు పెద్దపల్లి జిల్లాకు చెందినవారు. వీరు పార్టీలు వేరైనప్పటికీ మంచి మిత్రులు కావడం కొసమెరుపు.
Similar News
News November 27, 2025
ఇతిహాసాలు క్విజ్ – 79 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది?
సమాధానం: శివ భక్తులైన మూడు జీవులు శివుడి కోసం తమ ప్రాణాలను అర్పించి మోక్షం పొందాయి. అవే.. శ్రీ (సాలెపురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు). ఈ 3 జీవులు శివుడిని అత్యంత భక్తితో పూజించి, స్వామి అనుగ్రహం పొంది అక్కడే లీనమయ్యాయి. వీటి పేర్ల కలయికతోనే ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు స్థిరపడింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 27, 2025
VKB: ‘ఎన్నికల విధుల్లో సక్రమంగా విధులు నిర్వహించాలి’

గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తు ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండ పారదర్శకంగా సజావుగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకురాలు షేక్ యాస్మిన్ భాష అన్నారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో ఎన్నికల నిర్వహణపై పరిశీలకురాలు కలెక్టర్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దన్నారు.
News November 27, 2025
జనగామ కలెక్టరేట్లో మీడియా సెంటర్ ప్రారంభం

జనగామ జిల్లా కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీడియా సెంటర్ను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తో కలిసి ఎలక్షన్స్ జనరల్ అబ్జర్వర్ కె.నిఖిల ఈరోజు ప్రారంభించారు. అనంతరం జిల్లా ఫొటో గ్యాలరీని ఆసక్తిగా తిలకించారు. గతంలో జిల్లా కలెక్టర్గా తాను అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేయాలని నోడల్ అధికారులకు సూచించారు. డీపీఆర్ఓ బండి పల్లవి పాల్గొన్నారు.


