News April 7, 2025
ఎమ్మెల్సీ మల్క కొమురయ్యను అభినందించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మల్క కొమురయ్యను సోమవారం ఐటి పరిశ్రమ, వాణిజ్యం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అభినందించారు. కాగా, మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్యలు పెద్దపల్లి జిల్లాకు చెందినవారు. వీరు పార్టీలు వేరైనప్పటికీ మంచి మిత్రులు కావడం కొసమెరుపు.
Similar News
News April 19, 2025
30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోతే..

పురుషుల్లో ఒంటరితనం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలలో సంతానోత్పత్తి, గర్భాశయ సమస్యలు అధికమవుతాయి. లేటు మ్యారేజ్‌లో భాగస్వామితో గొడవలు, డివోర్స్ అవకాశాలు ఎక్కువట. మరోవైపు కుటుంబం, సమాజం నుంచి కూడా ప్రశ్నలు, విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. 30 ఏళ్లు దాటాక మనసుకు నచ్చకపోయినా వచ్చిన సంబంధాన్ని ఒప్పుకోక తప్పదు. రాజీపడాల్సి వస్తుంది.
News April 19, 2025
కైలాసపట్నం పేలుడి ఘటన.. 10కి చేరిన మృతుల సంఖ్య

కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మడగల జానకిరామ్ (50) శనివారం ఉదయం మృతి చెందాడు. దీంతో ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరుకుంది. ప్రమాదం జరిగిన విజయలక్ష్మి గణేశ్ ఫైర్ వర్క్స్‌లో జానకిరామ్ మేనేజర్‌గా వ్యవహరించారు.
News April 19, 2025
గొల్లప్రోలు: జోడెడ్ల బండిపై జోడిగా పెళ్లికి

పెళ్లంటే వధూవరులు ఇద్దరు కారులో వెళ్లటం సహజమే. కానీ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పెళ్లికుమార్తె, పెళ్లికొడుకు జోడెడ్ల బండిపై జోడిగా వచ్చిన ఫొటో వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో వివాహం చేసుకునే వారు గుర్రపు బండ్లపై ఊరేగింపుగా వస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అదే విధంగా గొల్లప్రోలుకి చెందిన దీపిక కాకినాడకు చెందిన సాయి మనోజ్‌లు వినూత్నంగా జోడెడ్ల బండిపై ఊరేగింపుగా కళ్యాణ మండపానికి వచ్చారు.