News March 9, 2025
ఎమ్మెల్సీ రేసులో అద్దంకి..!

TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటాలు చేసిన అద్దంకి రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్‌లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించగా సామేలుకు కేటాయించడంతో నిరాశే ఎదురైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అవకాశం దక్కలేదు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తుండగా అద్దంకికి అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Similar News
News March 10, 2025
మిర్యాలగూడ: ఆరేళ్లుగా కోర్టులోనే ప్రణయ్ హత్య కేసు విచారణ

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు దాదాపు ఆరేళ్లుగా <<15708073>>కోర్టులోనే విచారణ<<>> కొనసాగుతోంది.ఎట్టకేలకు ఈరోజు తుది తీర్పు రానుంది. కాగా A1గా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా ప్రణయ్‌ను చంపిన బిహార్ వాసి సుభాష్ శర్మ A2గా, అజ్గర్ అలీ A3గా ,అబ్దుల్లా బారీ A4గా, MA కరీం A5గా, మారుతీరావు తమ్ముడు శ్రావణ్ A6గా, డ్రైవర్ శివ A7గా, నిజాం A8గా ఉన్నారు. ఈరోజు నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.
News March 10, 2025
మిర్యాలగూడ: ప్రణయ్ MURDER.. అసలేం జరిగింది?

> టెన్త్ నుంచి ప్రణయ్, అమృత ఫ్రెండ్స్
> 2018 JANలో HYDలో వారి ప్రేమ పెళ్లి
> విషయం తెలిసి 2కుటుంబాల్లో గొడవలు.. PSలో ఫిర్యాదు
> 2018 SEP 14న కులాంతర వివాహం తట్టుకోలేక ప్రణయ్‌ను దుండగుడితో <<15707820>>చంపించిన<<>> మారుతీరావు
> ప్రణయ్ తండ్రి ఫిర్యాదుతో 8 మందిపై కేసు నమోదు
> 2019 JUN 12న అప్పటి SPరంగనాథ్ ఆధ్వర్యంలో 1600పేజీల ఛార్జిషీట్ రూపొందించిన పోలీసులు
> 2020 మార్చిలో మారుతీరావు సూసైడ్
> నేడు తుది తీర్పు
News March 10, 2025
నల్గొండ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఆదివారం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సైతం తమ అభ్యర్థిని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దాసోజు శ్రవణ్ కుమార్‌కు ఈసారి అవకాశం కల్పించారు. ఆయన ఎంపిక పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు.