News November 3, 2024
ఎయిర్పోర్టులో కలిసిన తెలుగు రాష్ట్రాల స్పీకర్‌లు

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగే 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(CPA) కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్తూ ఎయిర్పోర్ట్ లాంజ్‌లో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కలుసుకున్నారు. వీరితో పాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లేజిస్లేచర్ సెక్రస్లేచర్ సెక్రటరీ డా.వి.నరసింహా చార్యులు ఉన్నారు.
Similar News
News February 21, 2026
RR: వారికి 100% రాయితీతో రూ.60వేలు

రాళ్లు కత్తిరించే వృత్తిలో అనుభవం ఉన్న ముస్లింలకు పునరావాసం, జీవనోపాధి కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారుడికి రూ.60 వేల చొప్పున, రూ.10 వేల విలువైన టూల్ కిట్, రూ.50 వేల విలువైన జనరేటర్‌ను 100% సబ్సిడీ కింద అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 1 వరకు http://tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
News February 21, 2026
బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) ప్రతిమా సింగ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా కొనసాగిన ప్రతిమాసింగ్ ప్రసూతి సెలవులపై వెళ్లారు. ప్రసూతి సెలవులు ముగియడంతో ఆమె శనివారం తిరిగి అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు అదనపు కలెక్టర్‌ను కలిసి బొకే సమర్పించారు.
News February 21, 2026
RR: సోమవారం నుంచి యథావిధిగా ‘ప్రజావాణి’

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23 (సోమవారం) నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజవాణి యథావిధిగా కొనసాగుతుందన్నారు.


