News March 22, 2025
ఎర్త్ అవర్ విధిగా పాటించండి: గవర్నర్

నేడు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు అనవసరమైన లైట్లను స్వచ్ఛందంగా ఆపివేసి ఎర్త్ అవర్ విధిగా పాటించాలంటూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన విజయవాడలోని రాజ్‌భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. “వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్” పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని గవర్నర్ సూచించారు.
Similar News
News September 13, 2025
నెల్లూరులో యువతి దారుణ హత్య!

నెల్లూరు నగరం కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు ఎదురెదురు ఇంట్లో ఉంటూ చనువుగా ఉండేవారు. గత అర్ధరాత్రి యువకుడితో మాట్లాడడానికి ఆ యువతి వెళ్లింది. ఈ క్రమంలో యువతిని పొడిచి చంపిన యువకుడు దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 13, 2025
3,115 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ

ఈస్టర్న్ రైల్వేలో 3,115 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే(SEP 13) చివరితేదీ. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, పెయింటర్, లైన్‌మెన్, వైర్‌మెన్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ విభాగాల్లో ఖాళీలున్నాయి. టెన్త్, ఇంటర్, ఉద్యోగాన్ని బట్టి ఐటీఐలో పాసవ్వాలి. వయసు 15-24ఏళ్ల లోపు ఉండాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వెబ్‌సైట్: <
News September 13, 2025
HYD: నేడు, రేపు MSME బిజినెస్ ఎక్స్‌పో

BNI హైదరాబాద్ ప్రతినిధులు అనిరుధ్ కొణిజేటి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సెప్టెంబర్ 13, 14న శంషాబాద్‌లో MSME ఎక్స్‌పో నిర్వహిస్తామని తెలిపారు. BNI ఆధ్వర్యంలో జరిగే ఈ ఎక్స్‌పోలో చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించబడనున్నట్లు వివరించారు. ఎక్స్‌పో విశేషాలను సీఎంకు వివరిస్తామని చెప్పారు.