News March 18, 2025
ఎర్రగుంట్లలో ప్రమాదం.. సత్యసాయి జిల్లా వ్యక్తి దుర్మరణం

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఇవాళ ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో సత్యసాయి జిల్లా వ్యక్తి దుర్మరణం చెందారు. ముందు వెళుతున్న వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన గండులూరి ఖాదరయ్య(41) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 18, 2025
SRD: 21 ఏళ్లకే సర్పంచ్గా గెలుపు

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం అలీఖాన్ పల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గుగులోతు రోజా సమీప ప్రత్యర్థిపై 76 ఓట్లతో విజయం సాధించారు. 21 సంవత్సరాల రోజా ఇంటర్ దాకా చదివింది. రోజా విజయంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీలో అభివృద్ధి కోసం కృషి చేస్తానని సర్పంచ్ రోజా తెలిపారు.
News December 18, 2025
టంగుటూరులో వ్యక్తి మర్డర్..?

ప్రకాశం జిల్లా టంగుటూరులో గురువారం ఓ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ హత్యకు గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న టంగుటూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే CI హజరతయ్య, SI నాగమల్లేశ్వరరావులు ఘటనా స్థలిని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ సైతం ఒంగోలు నుంచి రానున్నట్లు సమాచారం.
News December 18, 2025
NZB: తుది దశ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం

నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల తుది దశ పోరులో అధికార కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో విడతలో మొత్తం 165 పంచాయతీ సర్పంచ్లకు 19 చోట్ల ఏకగ్రీవం కాగా 146 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 95 చోట్ల, బీఆర్ఎస్ 36, బీజేపీ 16, స్వతంత్రులు 18 చోట్ల సర్పంచ్లుగా గెలుపొందారు.


