News March 18, 2025
ఎర్రగుంట్లలో ప్రమాదం.. సత్యసాయి జిల్లా వ్యక్తి దుర్మరణం

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఇవాళ ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో సత్యసాయి జిల్లా వ్యక్తి దుర్మరణం చెందారు. ముందు వెళుతున్న వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన గండులూరి ఖాదరయ్య(41) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 22, 2025
నారాయణపేట: బాలికపై యువకుడి అత్యాచారం

NRPT జిల్లా మద్దూరులో బాలికపై అత్యాచారం జరిగింది. కోస్గి సీఐ సైదులు తెలిపిన వివరాలు.. దామరగిద్ద మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) మద్దూరులో కంప్యూటర్ కోర్సు చేస్తోంది. దామరగిద్ద వాసి బోయిని శ్రీనివాస్(24) ఈనెల 10న బాలికకు మాయమాటలు చెప్పి తన బైక్పై HYDకు తీసుకెళ్లి ఓ కిరాయి రూంలో అత్యాచారం చేసి, తెల్లారి మద్దూరు బస్టాండ్లో వదిలేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News April 22, 2025
రాజ్ కసిరెడ్డిని మరోసారి విచారించనున్న సిట్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని కాసేపట్లో సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. నిన్న ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అటు నుంచి విజయవాడకు తరలించిన అధికారులు తెల్లవారుజామున 3 గంటల వరకు విచారించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కుంభకోణంలో కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ జడ్జి ముందు హాజరుపరిచే అవకాశముంది.
News April 22, 2025
ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు రూ.3కోట్ల ఆదాయం

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు రూ.3.02 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ రామ చంద్రమోహన్ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమం మహామండపం ఆరో అంతస్తులో సోమవారం నిర్వహించినట్లు ఈఓ అన్నారు. హుండీల ద్వారా నగదు, టిక్కెట్ల విక్రయాలు, తదితరాల ద్వారా 18 రోజులకు గాను రూ.3,02,92,986, 440 గ్రాముల బంగారం, 5.225 కిలోల వెండి సమకూరినట్లు వివరించారు.