News December 16, 2024

ఎర్రగుంట్ల RTPP ప్లాంట్‌లో కార్మికుడి మృతి

image

ఎర్రగుంట్లలోని ఆర్టీపీపీ స్టేజ్-4 ప్లాంట్‌లో విషాదం నెలకొంది. ప్లై‌యాష్‌లో కూర్చున్న సందీప్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు మృతిచెందారు. స్థానికులు ఆర్టీపీపీ యాజమాన్యంపై పలు ఆరోపణలు చేస్తున్నారు. బాధితుడి కుటుంబానికి ఆర్టీపీపీ యాజమాన్యం రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని కార్మిక, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.

Similar News

News November 27, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నిన్నటి కన్నా ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,550
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.11,546
☛ వెండి 10 గ్రాములు: రూ.1662.00

News November 27, 2025

కడప జిల్లాలో రూ.22.75 కోట్లు మాయం?

image

కడప జిల్లాలో పేజ్-3 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులు కనిపించడం లేదు. అప్పట్లో ప్రతి ఇంటికి పునాదుల కోసం రూ.35 వేలు వసూలు చేశారు. నిర్మాణాలు మొదలవ్వని 6,501 ఇళ్లకు సంబంధించి సుమారు రూ.22.75 కోట్లు స్వాహాపై ఇటీవల పరిశీలన చేపట్టారు. జిల్లాలో 16,765 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 10,264 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతా 6,501 ఇళ్లు ప్రారంభం కాలేదు. దీనిపై విచారణ చేపట్టారు.

News November 27, 2025

MP సీఎం రమేశ్ తల్లికి ప్రముఖుల నివాళి

image

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ పార్థివ దేహం వద్ద ప్రముఖులు నివాళి అర్పించారు. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణమరాజు, తెలంగాణ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కెవీపీ రామచంద్రారావు, ఇతర నాయకులు రత్నమ్మ పార్థివ దేహం వద్ద నివాళులర్పించి సీఎం రమేశ్‌ను పరామర్శించారు.