News September 19, 2024
ఎర్రగొండపాలెం MLA సమావేశం ఆంతర్యం ఏంటి?

ఎర్రగొండపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన ఇలా కార్యకర్తలతో సమావేశమవడం ఉత్కంఠ రేపుతోంది. కేవలం నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవడానికి ఇలా సమావేశం పెట్టారని కొందరు నేతలు చెబుతున్నారు.
Similar News
News November 20, 2025
ప్రకాశంలో ఆధార్ తిప్పలు.. కొలిక్కి వచ్చేనా?

ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆధార్‌తో పడుతున్న అవస్థలు ఎక్కువేనట. జిల్లాలోని పాఠశాలల్లో 363236 మంది విద్యార్థులు ఉండగా, 302626 మందికి ఆధార్ ద్వారా అపార్ ID వచ్చిందని లెక్క. మిగిలిన 60610 మంది విద్యార్థుల వివరాలు నమోదు కావాల్సిఉంది. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కార్డులో తప్పుగా నమోదైన వివరాలను సవరించినా ఆ వివరాలే వస్తున్నాయని వాపోయారు. కాగా ఆధార్ సమస్యలపై కామెంట్ చేయండి.
News November 20, 2025
ఒంగోలు మాజీ MP హత్యలో అతనే సూత్రధారి.?

మావోయిస్ట్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సుమారు 37ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న టెక్ శంకర్ పలు మావోయిస్ట్ ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు. అందులో 1995 డిసెంబర్ 1న ఒంగోలు మాజీ MP మాగుంట సుబ్బరామిరెడ్డిపై మావోయిస్టులు జరిపిన కాల్పుల కేసులో సైతం టెక్ శంకర్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
News November 20, 2025
ప్రకాశంలో ఆధార్ తిప్పలు.. కొలిక్కి వచ్చేనా?

ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆధార్‌తో పడుతున్న అవస్థలు ఎక్కువేనట. జిల్లాలోని పాఠశాలల్లో 363236 మంది విద్యార్థులు ఉండగా, 302626 మందికి ఆధార్ ద్వారా అపార్ ID వచ్చిందని లెక్క. మిగిలిన 60610 మంది విద్యార్థుల వివరాలు నమోదు కావాల్సిఉంది. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కార్డులో తప్పుగా నమోదైన వివరాలను సవరించినా ఆ వివరాలే వస్తున్నాయని దీంతో అపార్ ఐడీకి పెద్ద చిక్కులు వస్తున్నాయట.


