News September 19, 2024
ఎర్రగొండపాలెం MLA సమావేశం ఆంతర్యం ఏంటి?

ఎర్రగొండపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన ఇలా కార్యకర్తలతో సమావేశమవడం ఉత్కంఠ రేపుతోంది. కేవలం నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవడానికి ఇలా సమావేశం పెట్టారని కొందరు నేతలు చెబుతున్నారు.
Similar News
News July 8, 2025
ప్రకాశం: ఆ ప్రాంతంలో నిలిచిన మొహర్రం

ప్రకాశం జిల్లా తుమ్మలచెరువులో 2 రోజులుగా కొనసాగుతున్న మొహర్రం అనుకోకుండా నిలిచిపోయింది. దర్గా ప్రధాన ముజావర్ ఖైదా పీర్ల ఊరేగింపు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. దీంతో కార్యక్రమం నిలిచిపోయింది. 2 రోజుల తర్వాత వీధుల్లో పీర్ల ఊరేగింపు మళ్లీ నిర్వహించనున్నట్లు దర్గా నిర్వాహకులు తెలిపారు. కాగా జులై 2న <<16912097>>మృతుడు Way2Newsతో<<>> ఆ గ్రామ పీర్ల గొప్పదనాన్ని వివరించిన విషయం తెలిసిందే.
News July 8, 2025
ప్రకాశం: అద్దెకు ఇళ్లు.. చివరికి బెదిరింపులు

తన ఇంట్లో అద్దెకు ఉంటూ అద్దె చెల్లించకపోగా ఇంటి యజమానిని బెదిరిస్తున్న వైనంపై సదరు బాధితురాలు సోమవారం SP దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. సంతనూతలపాడు మండలం మంగమూరుకు చెందిన ఓ మహిళకు ఒంగోలులో నివాసం ఉంది. ఆ నివాసాన్ని అద్దెకు ఇచ్చారు. వారు అద్దె డబ్బులు చెల్లించకుండా, ఖాళీ చేయకుండా తనను బెదిరిస్తున్నట్లు సదరు యజమాని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News July 8, 2025
ఒంగోలు: ‘త్వరగా ఫిర్యాదులు పరిష్కరించాలి’

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 79 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను, ఫిర్యాదులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి ఫిర్యాదులను పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.