News September 25, 2024
ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై హైకోర్టు ఆదేశాలు

భీమిలీ ఎర్రమట్టి దిబ్బల్లో పనుల నిలిపేయాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఇక్కడి తవ్వకాలపై ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్, మత్స్యకార నాయకుడు శంకర్ ఇందుకు సంబంధించి పిల్ దాఖలు చేశారు. దిబ్బలు తవ్వుతున్న ప్రదేశం వారసత్వ సంపద పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా సొసైటీ పనులు చేస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
Similar News
News November 23, 2025
విశాఖ ప్రభుత్వ కార్యాలయాలలో రేపు PGRS: CP

విశాఖ సీపీ కార్యాలయంలో ఈనెల 24న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. కలెక్టరేట్, GVMC ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు వినతులు స్వీకరిస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 23, 2025
విశాఖ: కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గాయత్రి

కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం విశాఖ జిల్లా అధ్యక్షురాలిగా కాండవ గాయత్రి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మ నియామకపత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. జిల్లా కమిటీ నియమకం పూర్తిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు.
News November 23, 2025
విశాఖలో నాన్వెజ్ ధరలు

విశాఖపట్నంలో ఆదివారం నాన్వెజ్ ధరలు గణనీయంగా పెరిగాయి. మటన్ కేజీ రూ.950కి, చికెన్ స్కిన్లెస్ రూ.280కి, విత్స్కిన్ రూ.250కి, శొంఠ్యాం కోడి రూ.300కి పలుకుతోంది. డజన్ గుడ్లు రూ.66కు లభిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే అన్ని రేట్లు భారీగా పెరగడంతో కార్తీక మాసం ముగిసిన వెంటనే ఈ పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది.


