News March 16, 2025

ఎర్రవల్లి: కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం ద్వారా బోధనను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తెలిపారు. శనివారం గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి మండలంలోని కొండేర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ ఏఐఎక్స్ కంప్యూటర్ ల్యాబ్‌ ద్వారా విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు.

Similar News

News April 14, 2026

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్?

image

Jr.NTR బర్త్‌డే సందర్భంగా మే 20న ఆయన సినిమాలకు సంబంధించి రెండు స్పెషల్ అప్‌డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ‘డ్రాగన్’ మూవీ నుంచి టీజర్ వస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీపై అఫీషియల్ ప్రకటన, స్పెషల్ పోస్టర్ రానున్నట్లు పేర్కొన్నాయి. అదే రోజున ‘దేవర-2’పైనా మేకర్స్ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

News April 14, 2026

CSKతో మ్యాచ్.. టాస్ గెలిచిన KKR

image

IPL 2026: చెన్నైతో జరగనున్న మ్యాచులో KKR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
CSK: శాంసన్, గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్, శివమ్ దూబే, బ్రెవిస్, ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.
KKR: రహానె, గ్రీన్, రఘువంశీ, పావెల్, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, నరైన్, రమణ్‌దీప్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.

News April 14, 2026

కేటీఆర్‌.. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు: టీపీసీసీ చీఫ్

image

ఖమ్మం: కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. పదేళ్ల BRS పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవ్వడంపై మండిపడుతూ.. యాత్రకు ముందు సంతోష్ రావు, హరీశ్ రావుపై సొంత చెల్లెలు కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. పదవులు కోల్పోయిన ఆక్రోశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.