News March 12, 2025

ఎలక్ట్రికల్ పోల్ పడి కే.కోటపాడు వ్యక్తి మృతి

image

గాజువాక సమీపంలో గల నాతయ్యపాలెం డైరీ వద్ద మంగళవారం సాయంత్రం RTC బస్సు ఎలక్ట్రికల్ పోల్‌ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో K.కోటపాడుకు చెందిన బొత్స కామేశ్వరరావు(37) తీవ్ర గాయాలవ్వగా స్థానికుల వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనలో గాయపడ్డ మరో మహిళ దొడ్డి సత్యవతి చికిత్స పొందుతోంది. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 21, 2025

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎస్పీ

image

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధుల్లో అమరులైన పోలీసులకు ఎస్పీ పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అమరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

News October 21, 2025

పార్వతీపురం: ‘అమరవీరుల త్యాగాలు మరువలేనివి’

image

పోలీసు అమర వీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ ఎం.ప్రభాకర్ రెడ్డి, ఎస్పీ మాధవ్ రెడ్డి అన్నారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో వారు పాల్గొన్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఎన్నో సమస్యలు ఎదుర్కొని అంకితభావంతో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా విధుల్లో మృతిచెందిన అమరవీరులకు స్థూపం వద్ద నివాళులర్పించారు.

News October 21, 2025

రౌడీ షీటర్ దాడికి పాల్పడ్డాడని మహిళ SUICIDE

image

రౌడీ షీటర్ తనపై దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రఘునాథపాలెం(M)లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. జగ్యా తండాకు చెందిన బోడ సుశీల(26) అనే మహిళను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(రౌడీ షీటర్) దాడికి పాల్పడడంతో మనస్థాపానికి చెందిన సుశీల ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం ఉరి వేసుకునే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాలి.