News April 27, 2024
ఎలక్ట్రికల్ బైక్ తయారు.. 2 గంటల ఛార్జింగ్‌తో 25KM

తాడేపల్లిగూడెం పట్టణంలోని ఏపీ నిట్ విద్యార్థులు నూతన ఆవిష్కరణ చేశారు. కేవలం 2 గంటలు ఛార్జింగ్ పెడితే గంటకు 18 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో నడిచే ఎలక్ట్రికల్ బైక్‌ను రూపొందించారు. దీనిని శనివారం ఆవిష్కరించారు. మెకానికల్ ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు మనోజ్ కుమార్, అనీషా, ప్రత్యూష, కే.రాజేశ్వరి, కె.గణ వరప్రసాద్ బృందం ఈ బైక్ తయారు చేసింది. విద్యార్థులను కళాశాల అధ్యాపకులు అభినందించారు.
Similar News
News April 16, 2026
టీడీపీ పదవుల్లో ‘పశ్చిమ’కు పెద్దపీట

తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో ప.గో. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ పొలిట్‌బ్యూరోలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రామరాజు, ఎం.ఏ. షరీఫ్‌లకు చోటు కల్పించగా.. పీతల సుజాతకు జాతీయ స్థాయి పదవి వరించింది. అంగర రామ్మోహన్‌కు మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యత పాటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
News April 16, 2026
టీడీపీ పదవుల్లో ‘పశ్చిమ’కు పెద్దపీట

తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో ప.గో. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ పోలిట్‌బ్యూరోలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రామరాజు, ఎం.ఏ. షరీఫ్‌లకు చోటు కల్పించగా.. పీతల సుజాతకు జాతీయ స్థాయి పదవి వరించింది. అంగర రామ్మోహన్‌కు మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యత పాటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
News April 16, 2026
ప.గో: సహాయం చేయండి.. బహుమతి పొందండి

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే ‘పీఎం-రాహత్’ పథకంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గాయపడిన వారికి రూ. 1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని బుధవారం తెలిపారు. బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చే వారికి రూ.25 వేల నగదు పురస్కారం అందజేస్తామన్నారు. విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని ఆమె పిలుపునిచ్చారు.


