News February 1, 2025
ఎలక్షన్ కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి: CP

ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నియమ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ సూచించారు. పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ ఉన్న కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించి (2023, 2024, 2025 అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి ఏసీపీ, సీఐలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News October 18, 2025
కోతుల బెడద.. గ్రామస్థులు ఏం చేశారంటే..

TG: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం కూరెళ్లలో కోతుల బెడద విపరీతంగా పెరిగింది. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో సమస్యను తామే పరిష్కరించుకునేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి కోతులను బంధించే బృందాన్ని రప్పించాలని, ఒక్కో కోతిని పట్టుకునేందుకు రూ.300 చెల్లించాలని గ్రామస్థులు సమావేశమై నిర్ణయించారు. ప్రతి ఇంటి నుంచి రూ.1,000 చొప్పున ఇచ్చేందుకు ప్రజలు అంగీకరించారు.
News October 18, 2025
అచ్చంపేట: చెంచులకు సామూహిక వివాహాలు

వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 26న చంద్రారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో చెంచులకు సామూహిక వివాహ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు కార్టులు వెంకటయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి దేవి హాజరు కానున్నట్లు ఆయన వెల్లడించారు.
News October 18, 2025
వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా అనంతలక్ష్మి

వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన ఏలేటి అనంతలక్ష్మి ఎంపికయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా అనంతలక్ష్మి అన్నారు.