News May 12, 2024

ఎలక్షన్ డ్యూటీకి వెళ్తుండగా ఉపాధ్యాయుడికి ఫిట్స్

image

ఎలక్షన్ విధుల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడు అస్వస్థతకు గురయ్యారు. గంగవరం మండలం బియ్యంపాలెం ఎంపీపీ స్కూల్‌ టీచర్ తమన్నదొర శనివారం సాయంత్రం తోటి ఉపాధ్యాయులతో కలిసి కారులో పాడేరు వెళ్తున్నారు. అడ్డతీగల మండలం వీరభద్రాపురం సమీపంలో తమన్నదొరకు ఫిట్స్ రాగా.. స్థానిక యూటీ‌ఎఫ్ నాయకులు ఆర్వో ప్రశాంత్ కుమార్‌కు సమాచారం ఇచ్చారు. అధికారుల అనుమతితో ఇంటికి చేర్చారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.

Similar News

News February 16, 2025

గోకవరం: స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ 

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రరతిష్టాత్మకంగా చేపట్టిన స్వేచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమం గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొని ఇంకుడు గుంటలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ అప్పలరాజు, తదితర మండల నాయకులు పాల్గొన్నారు.

News February 15, 2025

గోకవరం: స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

image

గోకవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన కుంచే నాగేంద్ర (5) ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. మృతి చెందిన విద్యార్థి  కోరుకొండలో ప్రైవేట్ స్కూల్లో ఎల్‌కేజీ  చదువుతున్నాడు. ఈ సంఘటనతో వెదురుపాకలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 15, 2025

రాజమండ్రి: దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

image

బిక్కవోలు కేంద్రంగా దోంగ నోట్లును ముద్రిస్తున్న ఐదుగురి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ.. దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠా నుంచి 1.07 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేశామన్నారు. బిక్కవోలుకు చెందిన మెకానిక్ నకిలీ నోట్లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి నకిలీ నోట్ల గుట్టురట్టు చేశారు.

error: Content is protected !!