News March 29, 2024
ఎలక్షన్ వేళ ఉమ్మడి జిల్లాపై డేగ కన్ను
ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. లోక్ సభ అభ్యర్థులు నిబంధనలను ఉల్లంఘిస్తే గుర్తించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాలను నియమించింది. ప్రత్యేకబృందానికి కేటాయించిన వాహనానికి సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఉంది. ఈ బృందం రాజకీయ పార్టీల కార్యక్రమాలు, అభ్యర్థుల ర్యాలీలు జరిగే చోటుకు వెళితే చాలు అవన్నీ కెమెరాలో రికార్డయి అధికారులకు సమాచారం పోతుంది.
Similar News
News January 13, 2025
KMM: రూ.22వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు: డి.సీఎం భట్టి
ఇందిరమ్మ ఇళ్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక అప్డేట్ ఇచ్చారు. రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. కానీ గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆరోపించారు.
News January 12, 2025
ఖమ్మంలో 2 రోజులు పర్యటించనున్న Dy.CM భట్టి
ఖమ్మం జిల్లాలో రెండు రోజులు పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు భట్టి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ‘సోమవారం రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం 2 గంటలకు రఘునాథపాలెం మండలం మంచుకొండలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తారు. మంగళవారం మధిరలో జరిగే సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న’ట్లు వివరించారు.
News January 12, 2025
కొనిజర్ల: లారీని, బస్సును ఢీ కొట్టిన మరో లారీ
ఖమ్మం జిల్లా కొనిజర్ల సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని, ట్రావెల్ బస్సును మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లకు గాయాలయ్యాయి. ట్రావెల్ బస్సు డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో 56 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.