News June 26, 2024
ఎలమంచిలి ఎమ్మెల్యే తండ్రికి గాయాలు

సబ్బవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తండ్రి సుందరపు సత్యనారాయణ గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు వర్షం కారణంగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఎలమంచిలి నుంచి ఆనందపురం వైపు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన అతనిని అపోలో ఆసుపత్రికి తరలించారు. సబ్బవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 2, 2025
విశాఖ: ‘మా కొడుకును కోడలే చంపింది’

విశాఖలో ఓ వ్యక్తి ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కిశోర్, మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దొండపర్తి సమీపంలోని కుప్పిలి వీధిలో ఉంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. కిశోర్ ఉరివేసుకున్నాడు. అయితే కోడలే తమ కొడుకుని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని కిశోర్ తల్లి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
News December 2, 2025
విశాఖలో చేనేత వస్త్రాలు, హస్త కళల ప్రదర్శన ప్రారంభం

విశాఖలో ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ సాంప్రదాయ, చేనేత వస్త్రాలను, హస్త కళల ప్రదర్శనను ఏర్పాటు చేసింది. హోటల్ గ్రీన్ పార్క్లో సోమవారం ఈ ప్రదర్శనను CMR అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల అధినేత మల్లిక్ కంకటాల, చందు తిప్పల ప్రారంభించారు. కార్యక్రమంలో క్రాఫ్ట్స్ కౌన్సిల్ బుక్లెట్ను విడుదల చేశారు. ప్రదర్శనలో కొల్హాపురి పాదరక్షలు, కలంకారి హ్యాండ్ పెయింటింగ్ లైవ్ క్రాఫ్ట్ డెమో అందరినీ ఆకట్టుకున్నాయి.
News December 2, 2025
విశాఖలో రెండు రోజులు ఆధునిక హస్తకళల ప్రదర్శన

విశాఖలో 2 రోజులు ఆధునిక హస్తకళల ప్రదర్శనను క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహిస్తున్నారు. హోటల్ గ్రీన్ పార్క్లో డిసెంబర్ 1, 2వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రదర్శన జరుగుతోంది. దేశం నలుమూలల నుంచి వివిధ రకాల ఆధునిక నేత వస్త్రాలు, చేనేత హస్తకళల ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. భారతీయ కళాకారులు, నేతదారుల ప్రతిభను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు.


