News January 31, 2025
ఎలమంచిలి: చెక్ బౌన్స్ కేసులో డీటీకి జైలు శిక్ష

చెక్కు బౌన్స్ కేసులో ఎలమంచిలి డిప్యూటీ తహశీల్దార్ టీ.హనుమాన్ వినయ్ కుమార్కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.9.05 లక్షల జరిమానా విధిస్తూ విశాఖ రెండో అదనపు ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. 2019 నవంబర్ 14న టి.పద్మావతి దగ్గర డీటీ రూ.12 లక్షలు అప్పుగా తీసుకుని 2022న మార్చి 2న అప్పు తీర్మానం నిమిత్తం చెక్కు ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Similar News
News September 16, 2025
సిరిసిల్ల: ‘బోర్డు జీవో 12ను ప్రభుత్వం వెంటనే సవరించాలి’

భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు జీవో 12ను వెంటనే సవరించాలని బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. సిరిసిల్లలోని శివనగర్ లో సిఐటియు ఆధ్వర్యంలో బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ 3వ మహాసభలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికులు దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారని వివరించారు.
News September 16, 2025
నిజామాబాద్: ఈ నెల 17 నుంచి పోషణ మాసం

పిల్లల పెరుగుదలకు, పోషణ లోపం తగ్గించుట, బరువు లోపం లేకుండా పోషక ఆహారాలను అందించుటలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
News September 16, 2025
రానున్న 2-3 గంటల్లో వర్షం.. భారీగా ఈదురు గాలులు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురవొచ్చని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.