News February 21, 2025
ఎలమంచిలి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి జైలు శిక్ష

ఎలమంచిలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 31 మందిని గురువారం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. 16 మందికి రూ.పదివేలు చొప్పున న్యాయమూర్తి జరిమానా విధించారు. మరో 15 మందికి నాలుగు రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
Similar News
News December 10, 2025
MDK: ఓటర్ లిస్ట్.. చెక్ చేసుకోండి ఇలా!

ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతోంది. ఎలక్షన్ కమిషన్ జిల్లాల్లో ప్రతి మండలానికి సంబంధించి గ్రామాల్లో వార్డుల వారీగా ఓటర్ లిస్టు అందుబాటులో ఉంచింది. తెలుగు, ఇంగ్లిష్ ఫార్మాట్లలో ఓటర్ లిస్ట్ అందుబాటులో ఉంది. గ్రామం, వార్డుల వారీగా ఓటర్ల వివరాలు తెలుసుకోవడానికి https://finalgprolls.tsec.gov.in వెబ్‌సైట్ పై క్లిక్ చేయండి. జిల్లా, మండలం, గ్రామం ఎంచుకోండి. వివరాలు కనిపిస్తాయి.
News December 10, 2025
గ్రేటర్ వరంగల్‌లో డివిజన్ల పెంపునకు ప్రతిపాదనలు!

గ్రేటర్ వరంగల్ సమీప ప్రాంతాలు మరోసారి విలీనం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 66 డివిజన్లకు అదనంగా మరో 22 డివిజన్‌లను పెంచాలని ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే మడికొండ, రాంపూర్ దాటిన నగరం పెండ్యాల వరకు పెంచాల్సి వస్తోంది. దీంతో పాటు గీసుగొండ, దామెర, ఎల్కతుర్తి, ఐనవోలు వరకు విస్తరణ ఉండే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే విలీన గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
News December 10, 2025
టేకులపల్లి: లారీని ఢీకొట్టి యువకుడికి తీవ్రగాయాలు

టేకులపల్లి మండలంలోని బోరింగ్ తండా నుంచి టేకులపల్లి వైపు వస్తున్న బైక్ బుధవారం లారీని ఢీ కొట్టడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. కొత్తగూడెం నుంచి బొగ్గు తరలిస్తున్న లారీని ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


