News March 4, 2025
ఎలమంచిలి: నేషనల్ సీనియర్ ఉమెన్ హాకీ పోటీలకు ఎంపిక

జాతీయ సీనియర్ ఉమెన్ హాకీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున ఆడేందుకు ఎలమంచిలికి చెందిన ముగ్గురు క్రీడాకారిణులు ఎంపికైనట్లు జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొఠారు నరేశ్ సోమవారం తెలిపారు. పంజాబ్ రాష్ట్రం చండీఘర్‌లో జరుగుతున్న జాతీయ పోటీల్లో వీరు ఈనెల 4వ తేదీన ఆడతారని తెలిపారు.
Similar News
News March 18, 2025
స్త్రీ2, పుష్ప-2ను అధిగమించిన ఛావా

‘ఛావా’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన ఐదో వారం హిందీలో అత్యధిక వసూళ్లు (₹22cr) సాధించిన సినిమాగా నిలిచింది. స్త్రీ-2 (₹16cr), పుష్ప-2 (₹14cr) సినిమాల్ని అధిగమించింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఇండియాలో నెట్ కలెక్షన్స్ ₹562.65crకు పైగా రాగా, ప్రపంచ వ్యాప్తంగా ₹750.5crకు పైగా వచ్చాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
News March 18, 2025
సిద్దిపేట: ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో ప్రాణాలపై తెచ్చుకోవద్దు: సీపీ

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సీపీ అనురాధ సూచించారు. సోషల్ మీడియా వేదికగా ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌లను ప్రమోట్ (ప్రోత్సాహించే) వారి సమాచారం అందించాలని, బెట్టింగ్‌లపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోసపూరిత ప్రకటనలు, నమ్మి సందేశాలు, ఇతర వివరాలు పంపొద్దన్నారు.
News March 18, 2025
మోదీతో జోక్ చేసిన న్యూజిలాండ్ ప్రధాని

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్, మోదీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇటీవల భారత్ CTకప్ గెలవటం మోదీ ప్రస్తావించలేదు. నేను కూడా భారత్ పై న్యూజిలాండ్ టెస్ట్ విజయాల టాపిక్ తీయలేదు. ఈ రెండు విషయాలను పక్కన పెడదామని క్రిస్టఫర్ చమత్కరించారు. దీంతో ప్రధాని మోదీ తోపాటు క్రికెటర్ రాస్ టేలర్ తదితరులు నవ్వులు చిందించారు.