News March 27, 2025

ఎలమంచిలి మున్సిపల్ ఛైర్ పర్సన్‌పై అవిశ్వాసం

image

ఎలమంచిలి మున్సిపల్ ఛైర్‌పర్సన్ పిల్లా రమా కుమారిపై అవిశ్వాసానికి మున్సిపల్ కౌన్సిలర్లు బుధవారం కమిషనర్ ప్రసాద్ రాజుకు నోటీసు ఇచ్చారు. ఆమె వైసీపీ నుంచి బీజేపీలో చేరారు. దీంతో వైసీపీ అధిష్ఠాన వర్గం ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 19 మంది కౌన్సిలర్లు కమిషనర్‌కు ఇచ్చిన నోటీసులో సంతకాలు చేశారు. ముందుగా ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు క్యాంపు కార్యాలయంలో వైసీపీ కౌన్సిలర్లు సమావేశయ్యారు.

Similar News

News October 20, 2025

కూతురిపై అత్యాచారానికి యత్నించాడని కొట్టిచంపిన తండ్రి!

image

తన కూతురిపై అత్యాచారానికి యత్నించిన కామాంధుడిని రాయితో కొట్టి చంపాడో తండ్రి. ఒడిశాలోని థెన్‌కనల్ జిల్లాలో జరిగిందీ ఘటన. కాలువలో స్నానం చేసేందుకు తండ్రితో కలిసి బాలిక (10) వెళ్లింది. స్నానం ముగించుకున్నాక పక్కకు వెళ్లిన సమయంలో కరుణాకర్ (27) అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఏడుపు విన్న తండ్రి వచ్చి బండరాయితో కొట్టి చంపాడు. తర్వాత స్థానిక పర్జంగ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

News October 20, 2025

కందుకూరు TDPలో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు..

image

కందుకూరు నియోజకవర్గ టీడీపీలో ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు ..’ అన్న సామెత ఆదివారం నిజమైంది. రెండు దశాబ్దాల పాటు TDPలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ MLA డా.దివి శివరాంకు ఆదివారం దారకానిపాడులో కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. శివరాం అనుచరుడిగా, ఆయన పైరవీలతో పార్టీ ఇన్‌ఛార్జ్ అయి, ప్రస్తుతం MLAగా ఉన్న ఇంటూరి నాగేశ్వరావు కుర్చీలో కూర్చుంటే వెనుక వరుసలో శివరాం నిలబడాల్సి వచ్చింది.

News October 20, 2025

రోహిత్, విరాట్ ఫామ్‌పై స్పందించిన గవాస్కర్

image

ఆస్ట్రేలియాతో రెండో ODIలో రోహిత్, విరాట్ తిరిగి పుంజుకుంటారని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశాభావం వ్యక్తంచేశారు. వారిద్దరూ భారీ స్కోర్లు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నారు. ‘రోహిత్, కోహ్లీ 2 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడట్లేదు. AUSలో బౌన్సీ పిచ్‌పై అంత ఈజీ కాదు. వారు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా లయను అందుకుంటారు. టీమ్ ఇండియా 300+ రన్స్ చేస్తుంది’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.