News November 9, 2024

ఎలమంచిలి: రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ‘ప్రగడ’

image

ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావును ఏపీ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ప్రగడను పొత్తుల్లో భాగంగా చివరి నిమిషంలో తప్పించారు. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా జనసేన గెలుపుకు ప్రగడ సహకరించారు.

Similar News

News December 9, 2024

అల్లూరి జిల్లాలో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి

image

పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ గడుగుపల్లిలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు మృతి చెందారని ఎస్‌ఐ కే.రమణ తెలిపారు. గ్రామానికి చెందిన కొర్రా లక్ష్మి(36), ఆమె కుమారుడు సంతోష్(13), కుమార్తె అంజలి(10) ఇంటి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News December 9, 2024

విశాఖ-సికింద్రాబాద్ మధ్య సంక్రాంతికి స్పెషల్ ట్రైన్ 

image

సంక్రాంతి సీజన్ దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. సికింద్రాబాద్-విశాఖ(07097/07098) ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి ఈనెల 15, 22,29 తేదీల్లో నడపనున్నట్లు తెలిపారు. అలాగే విశాఖ-సికింద్రాబాద్(07097/07098) స్పెషల్ విశాఖ నుంచి 16, 23,30 తేదీల్లో నడుస్తాయన్నారు. >Share it

News December 9, 2024

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: బొత్స

image

తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైనట్లు MLC బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ నగరం లాసన్స్‌బే కాలనీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు పంట నష్టంపై వినతి పత్రం అందజేస్తామన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలన్నారు.