News February 21, 2025
ఎలమంచిలి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ఎలమంచిలి మండలం పెద్దపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం చెందాడు. హైవే జంక్షన్లో వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు స్థానిక గాంధీ నగరానికి చెందిన సత్యనారాయణ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 5, 2025
సిద్దిపేట: రెండవ రోజు 295 నామినేషన్లు దాఖలు

సిద్దిపేట జిల్లాలో మూడవ విడత తొమ్మిది మండలాల పరిధిలోని 163 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు 295 నామినేషన్లు దాఖలు కాగా, ఇప్పటి వరకు మొత్తంగా 468 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. అటు 1432 వార్డులకు గానూ రెండవ రోజు 1111 నామినేషన్లు దాఖలు కాగా, మొత్తం 1472 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. రేపు నామినేషన్లకు చివరి రోజు
News December 5, 2025
విజయనగరంలో డిగ్రీ విద్యార్థి సూసైడ్

విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఓ విద్యార్థిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహారాజా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న స్వాతిగా పోలీసులు గుర్తించారు. ఈమె స్వస్థలం శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంగా తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
News December 5, 2025
డిసెంబర్, జనవరి పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

శ్రీవారి ఆలయంలో డిసెంబర్ నుంచి జనవరి వరకు జరిగే పలు పర్వదినాలు, ప్రత్యేక కైంకర్యాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిర్ణీత రోజుల్లో టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించింది. 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 29న వైకుంఠ ఏకాదశి ముందు రోజు నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. ఈ తేదీలకు ముందురోజు వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది.


