News February 20, 2025

ఎలమంచిలి: రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

image

అనకాపల్లి జిల్లాలో నిన్న జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. ఎలమంచిలికి చెందిన డి.సన్యాసిరావు బైకుపై వస్తుండగా.. లైనుకొత్తూరు వద్ద లారీ ఢీకొట్టడంతో మృతిచెందారు. అలాగే రేగుపాలెం వద్ద మరో ప్రమాదం జరిగింది. రాజాన మోహన్(24) బైకుపై వస్తూ రోడ్డు పక్కన వృద్ధుడిని ఢీకొట్టాడు. ఆ తర్వాత స్పీడ్ కంట్రోల్ చేయలేక ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. 

Similar News

News November 28, 2025

మారిన తూ.గో స్వరూపం.. పెరిగిన ఓటర్ల సంఖ్య

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా స్వరూపం మరోసారి మారనుంది. మండపేట నియోజకవర్గం అదనంగా చేరడంతో జిల్లాలో మండలాల సంఖ్య 21కి, నియోజకవర్గాల సంఖ్య ఏడు నుంచి ఎనిమిదికి పెరిగాయి. నవంబర్ 11 నాటికి జిల్లా ఓటర్ల సంఖ్య 16,23,528 ఉండగా, మండపేట నియోజకవర్గం చేరికతో మొత్తం ఓటర్ల సంఖ్య 18,37,852 కు పెరిగింది.

News November 28, 2025

నెల్లూరు జిల్లాలో మార్పులు.. మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా.?

image

జిల్లాలో 5 మండలాల డివిజన్ మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కందుకూరు డివిజన్లో ఉన్న కొండాపురం, వరికుంటపాడు మండలాలను కావలి డివిజన్‌లో కలిపేలా నెల్లూరు డివిజన్‌లో ఉన్న కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను తిరుపతి జిల్లా గూడూర్ డివిజన్‌లో కలిపేలా నిర్ణయిస్తూ గెజిట్ విడుదల చేసింది. వీటిపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా తెలుపాలని అధికారులు సూచించారు.

News November 28, 2025

సిక్కోలుపై తుఫాన్ ప్రభావం..!

image

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా శ్రీకాకుళం జిల్లా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ సూచించారు.