News September 11, 2024

ఎలాంటి అపశ్రుతులు లేకుండా నిమజ్జనం పూర్తి చేయాలి: ఎస్పీ

image

గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ బిందు మాధవ్ ఆదేశించారు. ఆదోని మండలం చిన్నహరివాణం ఎల్లెల్సీ కాలువ వద్ద గురువారం వినాయక ఘాట్‌ను ఆయన పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడుతూ.. నిమజ్జనం సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. నిర్వాహకులకు సూచనలు చేస్తూ ఉండాలన్నారు.

Similar News

News October 11, 2024

ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: నంద్యాల ఎస్పీ

image

నంద్యాల జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు, పోలీసులు సంతోషంగా జీవించాలని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందేలా విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆకాంక్షించారు.

News October 11, 2024

ఆడపిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: కలెక్టర్

image

ఆడపిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని కలెక్టర్ రంజిత్ బాషా పిలుపునిచ్చారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లో అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం భేటీ బచావో-భేటి పడావో కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తోందన్నారు. ఆడపిల్లలను మంచి చదువులు చదివించాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు.

News October 11, 2024

జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన బెళగల్ విద్యార్థి

image

కోసిగి మండలం దొడ్డి బెళగల్‌కు చెందిన జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సందిప్ ఆగ్రాలో జరిగిన జాతీయ స్థాయి లాక్రోస్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీయాన్ కుమారి అభినందించారు. ఆమె మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన స్థాయిలో ఆడాలని ఆకాంక్షించారు.