News September 13, 2024
‘ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరగాలి’
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం గోదావరి సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, సంబధిత అధికారులతో ఆమె సమీక్షించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సుమారు 5.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని అంచనా ఉండగా అందులో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు పటిష్ఠ ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News October 15, 2024
ఏలూరు జిల్లాలో టెట్ పరీక్షలకు 48 మంది గైర్హాజర్
ఏలూరు జిల్లాలో నిర్వహించే టెట్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని విద్యాశాఖ అధికారి అబ్రహం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 186 మంది విద్యార్థులకు 158 మంది, మధ్యాహ్నం 186 మందికి 166 మంది హాజరయ్యారని తెలిపారు. ఉదయం 28 మంది, మధ్యాహ్నం 20 మంది గైర్హాజరయ్యారని చెప్పారు.
News October 15, 2024
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో ఉండి ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో దిగిన చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి-2898AD చిత్రం షూటింగ్ జరుగుతున్న సందర్భంలో అశ్వథ్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
News October 15, 2024
పట్టభద్రుల స్థానాన్ని ఐక్యంగా పోరాడి గెలిపించాలి: మంత్రి నిమ్మల
ఉమ్మడి తూర్పు – పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్సీ స్థానాన్ని కూటమి నేతలు ఐక్యంగా పనిచేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. రాజమండ్రిలో పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు, సన్నాహ కార్యక్రమం లో భాగంగా ఎన్డీయే పార్టీ నేతల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సమావేశానికి టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.