News March 2, 2025
ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి: జిల్లా కలెక్టర్

రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రంజాన్ మాసం ఏర్పాట్లపై శనివారం ఐడీఓసీ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Similar News
News December 4, 2025
శ్రీరాంపూర్: ఈ నెల 8న అప్రెంటిస్ట్ మేళా

ఈ నెల 8న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ శ్రీరాంపూర్ ప్రిన్సిపల్ సుజాత తెలిపారు. అప్రెంటిషిప్ మేళాలో మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఫ్రెండ్షిప్ మేళాలో పాల్గొనాలన్నారు. అర్హత గలవారు www.apprenticeshipindia.gov.inలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
News December 4, 2025
లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి గురువారం ఆలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణోత్సవాలను విజయవంతం చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News December 4, 2025
సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.


