News March 28, 2025
ఎలిగేడు: బాలుడి హత్య

బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో జరిగింది. సాయికుమార్ (17) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఆరోపిస్తున్న మృతుడి బంధువులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 14, 2025
గజ్వేల్లో ఒకే కాలనీకి ఆరు పేర్లు

గజ్వేల్ పట్టణంలోని ఓ కాలనీకి ఆరు పేర్లు ఉండడం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ కాలనీని గతంలో వినాయకనగర్ కాలనీ, రెడ్డి కాలనీ అని పిలిచేవారు. తాజాగా ముదిరాజ్, యాదవ్, విశ్వకర్మ, ఆర్యవైశ్య కాలనీలుగా బోర్డులు పెట్టడంతో ఈ కాలనీకి ఒకేసారి ఆరు పేర్లు వచ్చాయి. ఒకే కాలనీకి ఇన్ని పేర్లు ఉండడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
News September 14, 2025
HDFC బ్యాంకు సేవలకు అంతరాయం!

HDFC బ్యాంకు సేవలకు అంతరాయం కలుగుతోంది. UPI ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నామని చాలామంది వినియోగదారులు రిపోర్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనిపై బ్యాంక్ ఇంకా స్పందించలేదు. మీకు ఈ సమస్య ఎదురైందా? COMMENT
News September 14, 2025
HYD: రోడ్డుపై చెత్త వేస్తే 8 రోజుల జైలు శిక్ష

చెత్తపై స్పెషల్ డ్రైవ్ నేపథ్యంలో HYD పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డ మీద చెత్త వేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు మీద చెత్త వేసే చట్టంలోని సెక్షన్ ప్రకరాం 8 రోజులు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. బోరబండ పోలీసులు 2 రోజుల్లో రోడ్లపై చెత్త వేపిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి మీద ఛార్జిషీటు దాఖలు చేసి న్యాయమూర్తి ముందు హజరుపరచగా రూ.1000 ఫైన్ వేశారు.