News March 28, 2025
ఎలిగేడు: బాలుడి హత్య

బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో జరిగింది. సాయికుమార్ (17) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఆరోపిస్తున్న మృతుడి బంధువులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 21, 2025
భూభారతితో సమస్యల పరిష్కారం: కొత్తగూడెం కలెక్టర్

నూతన భూ భారతితో భూ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. 80% స్థానిక తహశీల్దార్ కార్యాలయంలోని భూ సమస్యలు పరిష్కారం కావడానికి వీలుందని పేర్కొన్నారు. భూభారతి సమావేశానికి మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డివిజనల్ రెవెన్యూ అధికారి దామోదర్ రావు, అశ్వాపురం తహసిల్దార్, రెవిన్యూ సిబ్బంది వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
News April 21, 2025
తులం బంగారం @రూ.1,00,000

బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. భారత లైవ్ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.లక్షను తాకినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అయితే, హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.99,860గా ఉన్నట్లు తెలిపారు. రేపటి వరకు రూ.లక్ష దాటే అవకాశం ఉందని వెల్లడించారు. అటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్స్ బంగారం ధర $3404 దాటినట్లు వెల్లడించారు. దీనికి అమెరికా- చైనా టారిఫ్ యుద్ధమే కారణమంటున్నారు.
News April 21, 2025
కృష్ణా: ట్రై సైకిల్ పంపిణీ చేసిన కలెక్టర్

సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు చాలా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్లో పాఠశాల విద్య – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కలెక్టర్ దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు.