News March 7, 2025
ఎలిమినేటి మృతికి 25 ఏళ్లు పూర్తి

నల్గొండ జిల్లా రాజకీయాలను శాసించిన నేతల్లో ఎలిమినేటి మాధవ రెడ్డి ఒకరు. వడపర్తిలో 1949 మే 1న జన్మించిన ఆయన ఉస్మానియాలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1983లో భువనగిరి MLAగా గెలిచి NTR వద్ద ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు కేబినెట్‌లో హోంమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో మావోయిస్టులకు టార్గెటయ్యారు. 2000 మార్చి 7న ఘట్‌కేసర్ వద్ద మందుపాతర పేల్చి మాధవరెడ్డిని చంపేశారు. నేడు ఆయన 25వ వర్ధంతి.
Similar News
News January 9, 2026
జాతీయస్థాయికి ఎంపికైన జనగాం కేజీబీవీ విద్యార్థిని

జనగాం జిల్లా కేజీబీవీ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జి.అక్షిత రూపొందించిన అడ్జస్టబుల్ బైక్ స్టాండ్ అనే వినూత్న ఆవిష్కరణకు గాను జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ (NLEPC) కు ఎంపికైంది. ఈ సందర్భంగా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్‌తో పాటు ఉపాధ్యాయ బృందం అక్షితను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
News January 9, 2026
BJP కొత్త ఆయుధంగా సెన్సార్ బోర్డు: స్టాలిన్

సెన్సార్ బోర్డుపై తమిళనాడు CM స్టాలిన్ ఫైర్ అయ్యారు. CBI, ED, IT శాఖ మాదిరే ఇప్పుడు సెన్సార్ బోర్డు BJP కొత్త ఆయుధంగా మారిందని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ మూవీ విషయంలోనే ఆయన స్పందించినట్లు తెలుస్తోంది. మొత్తం 25కట్స్ సూచిస్తూ U/A సర్టిఫికెట్‌ను CBFC జారీ చేసింది. 1965 యాంటీ హిందీ ఆందోళన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి DMK సపోర్ట్ ఉంది.
News January 9, 2026
KNR: ‘స్కూల్ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం’

KNRరూరల్(M) దుర్శేడ్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో కిసాన్ నగర్‌కు చెందిన బొడ్డు శశికుమార్(28) అక్కడికక్కడే మృతిచెందినట్లు రూరల్ CI నిరంజన్ రెడ్డి తెలిపారు. అతివేగంగా వచ్చిన <<18811180>>ఓ<<>> స్కూల్ బస్సు, శశికుమార్ ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టి తలపైనుంచి వెళ్లడంతో ఈ ఘోరం జరిగిందని పేర్కొన్నారు. నిందితుడైన డ్రైవర్ అనిల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


