News March 10, 2025

ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులందరితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్‌పై మండలస్థాయిలో సమావేశాలు నిర్వహించి, మార్చ్ 31 వరకే రాయితీ వర్తిస్తుందన్నారు. ప్రతి దరఖాస్తుదారుడికి ఫోన్ చేసి రాయితీని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

Similar News

News March 11, 2025

PPM: జిల్లాలో స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు పర్యటన

image

జిల్లాలో స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు బి.కాంతారావు పర్యటిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె. హేమలత అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో ఆమె తెలిపారు. ఆయన బుధవారం రాత్రికి జిల్లాకు చేరుకొని, బస వేయడం జరుగుతుందని తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరు అవుతారని ఆమె తెలిపారు.

News March 11, 2025

నేడు గ్రూప్-2 ఫలితాలు

image

TG: నేడు గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. 783 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక 1,363 గ్రూప్-3 పోస్టులకు సంబంధించి ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనుంది. మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది.

News March 11, 2025

మంత్రిత్వ శాఖ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న కలెక్టర్

image

న్యూఢిల్లీ నుంచి భారత ప్రభుత్వం, జల్ శక్తి మంత్రిత్వ శాఖవారు జల్ శక్తి అభియాన్ “జల్ సంచయ్ జన్ భగీదారి”పై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. “జెల్ సంచయ్ జన్ భగీదారి”పై దృష్టి సారించి వర్షాన్ని ఒడిసి పట్టీల చర్యలు చేపట్టాలని సోమవారం అన్నారు. జిల్లాలలో పురోగతిపై వర్చువల్ విధానంలో జల్ శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష నిర్వహించారు.

error: Content is protected !!