News March 12, 2025
ఎల్ఆర్ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు ఈ నెల 31లోగా ఎల్ఆర్ఎస్‌ను చెల్లించిన వారికి 25% రిబేట్ ఇస్తున్న విషయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్‌పై లైసెన్స్ టెక్నికల్ ప్లానర్లు, లే ఔట్ ఓనర్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రైటర్లతో సమావేశం నిర్వహించారు.
Similar News
News March 24, 2025
పోలీస్ గ్రీవెన్స్ డేకు 30 మంది ఆర్జీదారులు: SP

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 30 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు.
News March 24, 2025
నాగార్జునసాగర్ నేటి సమాచారం

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు సోమవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల కాగా ప్రస్తుతం 520.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 150.3730 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. సాగర్‌కు ఇన్ ఫ్లో 23183 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 14711 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News March 24, 2025
నల్గొండ కలెక్టరేట్ ప్రజావాణికి 100 దరఖాస్తులు

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సోమవారం సుమారు 100 మంది సమస్యల పరిష్కారం నిమిత్తం దరఖాస్తులు సమర్పించారు. ఈ దరఖాస్తులలో ఏప్పటిలాగే వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, పెన్షన్ మంజూరి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై వచ్చాయి.