News March 7, 2025

ఎల్‌ఆర్‌ఎస్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

ఎల్‌ఆర్‌ఎస్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. జగిత్యాల కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం ఎల్‌ఆర్‌ఎస్‌లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకుంటే 25% తగ్గింపు వర్తిస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్లకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News October 31, 2025

దస్తూరాబాద్: తాళం వేసిన ఇంట్లో చోరీ

image

తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన దస్తూరాబాద్ మండలంలోని రేవోజిపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. రేవోజిపేట గ్రామంలోని కొత్త పల్లెలోని ముప్పిడి రాధ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.

News October 31, 2025

నిర్మల్: రేపు జిల్లా వ్యాప్తంగా 2కే రన్ కార్యక్రమం

image

శుక్రవారం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో ఏక్తా దివస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులందరూ 2కే రన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు, పలు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో 2కే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలు, యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.

News October 31, 2025

దండేపల్లి: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

image

దండేపల్లి మండలం గూడెం శివారులో ఉన్న గోదావరి నదిలో దూకి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దండేపల్లి ఎస్ఐ తహిసొద్దీన్ తెలిపారు. హాజీపూర్ మండలంలోని కర్ణ మామిడికి చెందిన గోళ్ల రవీందర్ ఆరోగ్యం క్షీణించి మానసిక పరిస్థితి సరిగ్గా లేక జీవితంపై విరక్తితో గురువారం గూడెం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. రవీందర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.