News March 7, 2025
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో వాటికి పేమెంట్ జరిగి ప్రక్రియ పూర్తయ్యే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్‌లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ GWMC కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా పంచాయతీ, తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీ శాఖల్లో ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 5, 2025
ఆదోని జిల్లా డిమాండ్.. టీడీపీ నేతలపై సీఎం అసంతృప్తి

కర్నూలు జిల్లా నేతల తీరుపై CM చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండును ముందుగా తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎన్నికల ముందు ఆదోని జిల్లా డిమాండ్ లేదని తిక్కారెడ్డి వివరించినట్లు సమాచారం. దీనిపై జిల్లా నేతలంతా చర్చించుకుని తన వద్దకు రావాలని సీఎం సూచించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
News December 5, 2025
HYD: వాయిదాపడ్డ పరీక్షలు.. డేట్ ఫిక్స్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) పరీక్షలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ బి.శ్రీనివాస్ తెలిపారు. 3 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఈ విషయం గమనించాలని శ్రీనివాస్ కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు ఈ సెట్ నిర్వహిస్తారు.
News December 5, 2025
నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్‌లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్‌లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.


