News March 22, 2025

ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ 

image

ఎల్ఆర్ఎస్ ఆమోదించిన దరఖాస్తులకు సంబంధించిన లబ్ధిదారుల నుంచి ఫీజు వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సత్య శారద తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ధన కిషోర్ ఎల్ఆర్ఎస్‌పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎల్ఆర్ఎస్ 2020 స్కీం కింద ఫ్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు 41,443 దరఖాస్తులు రాగా.. అందులో 18,943 మంజూరు చేయగా, 100% ఫీజు వసూల్ చేయాలన్నారు.

Similar News

News March 26, 2025

వరంగల్: బస్టాండ్ నిర్మాణ పనుల్లో బాంబుల వినియోగం

image

వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనుల్లో ఆనధారితంగా బస్టాండ్ నిర్మాణం పనుల్లో బాంబులు ఉపయోగిస్తున్నారని ప్రజలు తెలిపారు. పునాది పనుల్లో  బాంబు పేలడంతో భూపాలపల్లి డిపో బస్సు అద్దాలు పగిలినట్లు ప్రజలు తెలిపారు. ప్రయాణికులు తప్పిన పెనుముప్పు. పోలీస్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.  

News March 25, 2025

WGL: మార్కెట్‌లో సరుకుల ధరలు ఇలా..

image

ఎనుమాముల మార్కెట్‌లో మంగళవారం పలురకాల మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి క్వింటాకి నిన్న రూ.10,500 ధర పలకగా.. నేడు రూ.10,800 పలికింది. అలాగే టమాటా మిర్చికి నిన్న రూ.26,500 ధర రాగా..నేడు రూ.28వేలు వచ్చింది. సింగిల్ పట్టికి రూ.27వేలు (నిన్న 26వేలు), దీపిక మిర్చి రూ.13,300(నిన్న రూ.22,500) ధర ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. మక్కలు బిల్టి క్వింటాకి నిన్న రూ.2265(నేడు రూ.2250) పలికిందన్నారు.

News March 25, 2025

KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

error: Content is protected !!