News March 1, 2025
ఎల్కతుర్తి: క్రేన్ తగిలి తండ్రి, కొడుకు స్పాట్ డెడ్

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రేన్ తగిలి తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతులు కోతులనడుమ గ్రామానికి చెందిన రాజేశ్వర్ రావు, వికాస్‌గా గుర్తించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 21, 2025
మత్స్యకారులకు అండగా వైసీపీ: జగన్

AP: మత్స్యకారులకు తమ పార్టీ అండగా ఉంటుందని YCP అధ్యక్షుడు జగన్ తెలిపారు. ‘సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. వారి సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. రూ.4,913 కోట్లు లబ్ధి చేకూర్చాం’ అని ట్వీట్ చేశారు.
News November 21, 2025
విశాఖ: ప్రేమ.. పెళ్లి.. ఓ తమిళబ్బాయ్..!

విశాఖలో ఒక అమ్మాయి కోసం ఇద్దరు యువకుల ఘర్షణ పడగా ఒకరికి గాయాలయ్యాయి. ఓ హోటల్లో పనిచేస్తున్న అమ్మాయి మొదట ఒక తెలుగు యువకుడ్ని ప్రేమించింది. తర్వాత మరో తమిళ యువకుడిని పెళ్లి చేసుకోవడానికి రెఢీ అయ్యింది. దీంతో ఆ ఇద్దరి యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తెలుగు యువకుడు, తమిళ యువకుడుపై కత్తితో దాడి చేసినట్లు అమ్మాయి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో త్రీటౌన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
News November 21, 2025
‘హిడ్మాను, మరికొందరిని పట్టుకొని ఎన్కౌంటర్ కథ అల్లారు’

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా కామ్రేడ్ రాజేతో పాటు కొంతమందిని విజయవాడలో ఈనెల 15న నిరాయుధంగా ఉన్న సమయంలో పట్టుకుని క్రూరంగా హత్య చేసి మారెడుమిల్లి ఎన్కౌంటర్ కట్టుకథను అల్లారని, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు . AOB రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్‌ను చంపారని అందులో పేర్కొన్నారు.


