News January 26, 2025
ఎల్కతుర్తి PS వద్ద యాక్సిడెంట్.. మహిళ మృతి

ఎల్కతుర్తి మండల పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందారు. మృతురాలు జంగం బుజ్జమ్మ(55)గా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహం వద్ద బంధువులు రోదిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 10, 2026
రాష్ట్రంలో 97 పోస్టులు నోటిఫికేషన్ విడుదల

<
News January 10, 2026
HYD: DANGER.. చిన్నపిల్లలకు ఈ సిరప్ వాడొద్దు

చిన్నపిల్లలకు ఇచ్చే ‘అల్మాంట్-కిడ్’ సిరప్ విషయంలో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) కీలక హెచ్చరిక జారీ చేసింది. బిహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్ ఉత్పత్తి చేసిన ఈ మందులో (బ్యాచ్: AL-24002) ప్రాణాంతకమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ రసాయనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల వద్ద ఈ బ్యాచ్ సిరప్ ఉంటే వెంటనే 1800-599-6969 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. దీన్ని తక్షణమే వాడకం నిలిపివేయాలన్నారు.
News January 10, 2026
కరీంనగర్‌లో బహిరంగ సభకు స్థలమే కరువైందా..?

కరీంనగర్‌లో అత్యంత రద్దీగా ఉండే కోర్టుచౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ సభ ఏర్పాటుచేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. PCC SC అధ్యక్షుడిగా కవ్వంపల్లి సత్యనారాయణ నియామకం తర్వాత తొలిసారి రాకను పురస్కరించుకుని ప్రధానరోడ్డుపైనే వేదిక నిర్మించారు. వేలసంఖ్యలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైన పర్మిషన్ ఇచ్చేముందు అధికారులు ఆలోచించాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.


