News February 15, 2025
ఎల్బీనగర్లో పోలీసుల కష్టాలు! (PHOTO)

ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో రాచకొండ ఆర్మ్ రిజర్వుడ్ పోలీసుల కష్టాలు వర్ణనాతీతం. ఖైదీలను తీసుకొని వెళ్లిన ప్రతిసారి ఇదే పరిస్థితి. కోర్టు ప్రాంగణంలో లంచ్ చేయడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం ఒక షెడ్ నిర్మించాలని రాచకొండ పోలీసులను ఓ వ్యక్తి ‘X’ వేదికగా కోరారు. నిబంధనల ప్రకారం సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాచకొండ పోలీసులు బదులిచ్చారు.
Similar News
News November 10, 2025
ప్రారంభమైన మార్కెట్.. తగ్గిన పత్తి ధర

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు క్వింటా పత్తి ధర రూ.6,800 పలికినట్లు పేర్కొన్నారు. గత వారం గరిష్టంగా పత్తి ధర రూ. 6,950 పలకగా.. నేడు భారీగా పడిపోయింది. దీంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.
News November 10, 2025
నిన్న అయ్యప్ప పూజకు హాజరు.. అంతలోనే..

TG: కవి అందెశ్రీ మరణాన్ని సాహితీప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న సమాచార హక్కు కమిషనర్ అయోధ్య రెడ్డి ఇంట్లో నిర్వహించిన అయ్యప్ప పూజకు ఆయన హాజరయ్యారు. రాత్రి కూడా బాగానే ఉన్నారని, భోజనం చేసి నిద్రపోయారని కుటుంబీకులు తెలిపారు. ఉదయం నిద్రలేపగా స్పందించలేదని, వెంటనే గాంధీకి తరలించినట్లు చెప్పారు. అయితే అప్పటికే అందెశ్రీ గుండెపోటుతో మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.
News November 10, 2025
కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ భేటీ

సీఎం చంద్రబాబు అధ్యక్షత ఏపీ క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. సుమారు 70 అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చలు జరుపుతోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ, ఏపీ నైబర్హుడ్ వర్క్స్పేస్ పాలసీ, ఐటీ శాఖకు చెందిన 10కి పైగా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు సహా సీఆర్డీఏ, పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖల్లో పనుల పాలనా అనుమతులపై చర్చిస్తోంది.


