News February 15, 2025
ఎల్బీనగర్‌లో పోలీసుల కష్టాలు! (PHOTO)

ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో రాచకొండ ఆర్మ్ రిజర్వుడ్ పోలీసుల కష్టాలు వర్ణనాతీతం. ఖైదీలను తీసుకొని వెళ్లిన ప్రతిసారి ఇదే పరిస్థితి. కోర్టు ప్రాంగణంలో లంచ్ చేయడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం ఒక షెడ్ నిర్మించాలని రాచకొండ పోలీసులను ఓ వ్యక్తి ‘X’ వేదికగా కోరారు. నిబంధనల ప్రకారం సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాచకొండ పోలీసులు బదులిచ్చారు.
Similar News
News March 28, 2025
HYD: భవనం పైనుంచి దూకి వివాహిత సూసైడ్

భవనం పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముషీరాబాద్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు..భోలక్‌పూర్‌కు చెందిన శబరీష్‌తో సౌజన్యకు గత నవంబర్ 13న వివాహమైంది. నిత్యం భర్త, అత్తమామలు గొడవ పడుతూ ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కుటుంబీకులకు ఫోన్ చేసిన సౌజన్య.. గురువారం మధ్యాహ్నం భవనంపై నుంచి దూకింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయింది.
News March 28, 2025
HYDలో 50 మంది GOVT అధికారుల తొలగింపు..!

పదవీ విరమణ పొందినా చాలా మంది ఇంకా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్, రీ అపాయింట్‌మెంట్ పేరిట ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఇలాంటివారు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 50 మంది ఉన్నట్లు తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. దీంతో 50 మంది వరకు మార్చి 31న ఇంటిముఖం పట్టనున్నారు. అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఇంకా కిందిస్థాయి సిబ్బంది వీరిలో ఉన్నారు.
News March 28, 2025
HYDలో తగ్గిన ఇళ్ల కొనుగోళ్లు: KTR

హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో HYDలో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని KTR Xలో ఆరోపించారు. పేదల ఇళ్లమీదకు బుల్డోజర్‌లు పంపి పెద్దలతో సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.‘గత త్రైమాసికంలో 49% ఇళ్ల విక్రయాలు తగ్గాయి. ఆఫీస్‌ల లీజింగ్ కూడా పాతాళానికి పడిపోయింది. ఈ ఏడాది 3 నెలల్లో కొనుగోళ్లు 41% తగ్గాయి. ప్రభుత్వం అబద్ధాలు మాని అభివృద్ధి చేయాలి, కూల్చడం కాదు, కట్టడం నేర్చుకోవాలి’ అని రాసుకొచ్చారు.