News February 15, 2025
ఎల్బీనగర్‌లో పోలీసుల కష్టాలు! (PHOTO)

ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో రాచకొండ ఆర్మ్ రిజర్వుడ్ పోలీసుల కష్టాలు వర్ణనాతీతం. ఖైదీలను తీసుకొని వెళ్లిన ప్రతిసారి ఇదే పరిస్థితి. కోర్టు ప్రాంగణంలో లంచ్ చేయడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం ఒక షెడ్ నిర్మించాలని రాచకొండ పోలీసులను ఓ వ్యక్తి ‘X’ వేదికగా కోరారు. నిబంధనల ప్రకారం సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాచకొండ పోలీసులు బదులిచ్చారు.
Similar News
News March 16, 2025
సూర్యాపేట: జిల్లాలో చికెన్ ధరలు ఇలా

సూర్యాపేట జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్ స్కిన్) కేజీ రూ.170-180 ఉండగా..స్కిన్‌లెస్ కేజీ రూ.200 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.110-120 మధ్య ఉంది. కాగా, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా, ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.
News March 16, 2025
మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని వీసీలో హెచ్చరించారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీ లేకుండా చూడాలని, ఉత్తీర్ణత పెంచాలని కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. జిల్లాలో 4,141 మంది 71 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. వీటిలో 20 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.
News March 16, 2025
తంగళ్ళపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముందస్తు అరెస్ట్

కాంగ్రెస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు టోనీని సిరిసిల్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాట్ల మధు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ ఒకరిపై ఒకరు సవాల్ విసురుకున్న విషయం తెలిసిందే. సవాల్ కోసం సిరిసిల్లకు చేరుకున్న టోనీని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. శాంతి భద్రతల దృష్ట్యా తంగళ్లపల్లిలో మధును, సిరిసిల్లలో టోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.