News January 27, 2025

ఎల్లారెడ్డిపేటలో దొంగల బీభత్సం

image

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. బంగారంతో పాటు నగదు దోచుకెళ్ళినట్లు ఇంటి యజమాని తెలిపారు. బందారపు రేవతి అనే మహిళ ఇంట్లో ఆరు తులాల పెద్ద గొలుసు, రూ.30 వేల నగదు దాచుకున్నారు. ఆదివారం సాయంత్రం వాటి కోసం వెతకగా చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 27, 2025

వరంగల్: ఎనిమిది కాళ్ల గొర్రె పిల్ల జననం..!

image

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఇస్లావత్ తండాలో 8 కాళ్లతో గొర్రె పిల్ల జన్మించింది. తండాకు చెందిన ఇస్లావత్ ధూప్ సింగ్‌కు చెందిన గొర్రె రెండో ఈతలో గొర్రె పిల్లకు జన్మనివ్వగా 8 కాళ్లతో జన్మించింది. పుట్టిన అరగంట తర్వాత గొర్రె పిల్ల మృతిచెందింది. దీంతో ఎనిమిది కాళ్లతో పుట్టిన గొర్రె పిల్లను చూడడానికి తండావాసులు తరలివచ్చారు. జన్యు మార్పుల వల్ల ఇలా జరుగుతూ ఉంటుందని పశువైద్యాధికారులు తెలిపారు.

News November 27, 2025

WGL: పంచాయతీ ఎన్నికలు.. బ్యాంకులకు అభ్యర్థుల పరుగులు..!

image

స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు నూతన బ్యాంకు ఖాతాలు కావాలని ఎలక్షన్ కమిషన్ నిబంధన విధించడంతో అభ్యర్థులు ఆయా బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి WGL జిల్లాలోని మండల కేంద్రాల్లో రెండు, మూడు బ్యాంకులకు చెందిన శాఖలు ఉండగా, వాటిల్లో ఇదివరకే అభ్యర్థులకు ఖాతాలు ఉన్నాయి. కాగా, మళ్లీ ఖాతా కావాలంటే బ్యాంకర్లు ఇవ్వడం లేదు. దీంతో అభ్యర్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.

News November 27, 2025

KMR: పీహెచ్సీ వైద్యాధికారులతో డీఎంహెచ్వో సమీక్ష

image

కామారెడ్డి కలెక్టరేట్‌లోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో డీఎంహెచ్వో డా.విద్య సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు వివరాలను, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై సమీక్షించారు. గర్భిణులకు, చిన్న పిల్లలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు సమయానుసారంగా అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.