News April 22, 2025
ఎల్లారెడ్డిపేట: ఆత్మహత్యాయత్నం.. యువకుడి మృతి

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన గడ్డి నరేందర్(28) <<16173915>>నిన్న<<>> రాత్రి ఆత్మహత్యయత్నం చేసుకున్నవిషయం తెలిసిందే. గడ్డి నరేందర్ మండల కేంద్రంలోని ఓ మహిళ తనను వేధింపులకు గురిచేస్తుందని అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని తీవ్ర గాయాలయ్యాడు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News April 22, 2025
హైదరాబాద్‌లో CSIR స్టార్ట్‌అప్ కాంక్లేవ్

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హైదరాబాద్‌లో CSIR స్టార్ట్‌అప్ కాంక్లేవ్‌ను ప్రారంభించారు. CSIR లాబొరేటరీ IICT, CCMB, NGRI సంయుక్తంగా నిర్వహించిన ఈ కాంక్లేవ్‌లో 70కు పైగా స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలు, ఉత్పత్తులు, ప్రదర్శించాయి. పరిశోధన, ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి MP ఈటల రాజేందర్, ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
News April 22, 2025
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్‌ను సన్మానించిన ఎస్పీ

పోలీస్ శాఖలో 33 సంవత్సరాలుగా సేవలందించడం అభినందనీయమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖలో నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్‌గా పనిచేస్తూ మంగళవారం పదవి విరమణ పొందుతున్న ఆర్.వెంకటేశ్వర్లును జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఘనంగా సత్కరించి వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు.
News April 22, 2025
CM రేవంత్ వస్తేనే నా పెళ్లి: వైరా యువకుడు

TG: CM రేవంత్ వస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు భీష్మించుకొని కూర్చున్నాడు. సీఎం ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం ఫిక్స్ చేసుకుంటానన్నాడు. లేదంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటానని చెబుతున్నాడు. వైరాకు చెందిన భూక్యా గణేష్ అనే యువకుడు MLA రామ్‌దాస్ మాలోతుకు ఓ లెటర్ రాశాడు. తన పెళ్లికి CMను తీసుకొచ్చే బాధ్యత ఆయనదేనంటూ విన్నవించాడు. ఆ లెటర్‌ను MLA కూడా CMకు పంపాడు.