News January 31, 2025
ఎల్లారెడ్డిపేట: ఇద్దరు దొంగలకు రిమాండ్

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో దొంగతనం పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని ఎస్‌ఐ రమాకాంత్ తెలిపారు. వంగల లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఈనెల 27వ తారీఖున దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన సంజీవ్, మనోజ్ అనే ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేసినట్లు నిర్ధారణ కాగా. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు.
Similar News
News February 9, 2025
డ్రామాలో బుడాన్ ఖాన్ కేసీఆర్: ఎంపీ రఘునందన్

డ్రామాలో బుడాన్ ఖాన్ కథ లెక్క కేసీఆర్ తీరు ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మెదక్‌లో పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు. బీజేపీ బలపర్చిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులున్నారు.
News February 9, 2025
మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా

మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవిని వీడారు. అమిత్ షాను కలిసిన అనంతరం బీరెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ భళ్లాకు పంపారు. కాగా బీరెన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు నిన్న కాంగ్రెస్ ప్రకటించింది. ఈలోపే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.
News February 9, 2025
ఆగిన ఫ్లడ్ లైట్లు.. మ్యాచ్ నిలిపివేత

భారత్-ఇంగ్లండ్ రెండో వన్డేకు అంతరాయం కలిగింది. రోహిత్ శర్మ జోరు మీదున్న టైంలో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. వెలుతురు లేక అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ఇరు జట్ల ప్లేయర్లు మైదానాన్ని వీడారు. దీంతో ప్రేక్షకులు సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేసి సందడి చేస్తున్నారు.