News February 17, 2025
ఎల్లారెడ్డిపేట: ఉరి వేసుకుని వ్యక్తి మృతి

ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం బోప్పపూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనుమ కనకయ్య ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 3, 2026
కేసీఆర్ సంతకమే తెలంగాణ పాలిట మరణ శాసనమైంది: రేవంత్

TG: కృష్ణా బేసిన్లో రాష్ట్ర ప్రాజెక్టులకు 490 టీఎంసీల కేటాయింపు ఉండేదని అసెంబ్లీలో CM రేవంత్ తెలిపారు. ‘రాష్ట్రం విడిపోయే ముందు కిరణ్ కుమార్ ప్రభుత్వం 299 టీఎంసీలే అని పేర్కొంది. ఆనాడు ఈఎన్సీగా ఉన్న మురళీధర్ రావు కూడా 299 టీఎంసీలే అని తప్పుడు నివేదిక ఇచ్చారు. 490 టీఎంసీల కోసం పోరాడాల్సిన KCR 299 టీఎంసీలకు అంగీకరిస్తూ సంతకం చేశారు. ఇదే తెలంగాణ పాలిట మరణశాసనంగా మారింది’ అని మండిపడ్డారు.
News January 3, 2026
HNK: లారీ ఢీకొని గీత కార్మికుడి దుర్మరణం

ములుగు రోడ్డులోని కొత్తపేట ఎన్ఎస్ఆర్ ఆసుపత్రి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరెపల్లికి చెందిన గీత కార్మికుడు గౌని అనిల్కుమార్ గౌడ్(48) మృతి చెందారు. బైక్పై వెళ్తున్న ఆయన్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆరెపల్లి రింగ్ రోడ్డు వద్ద సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News January 3, 2026
KCR ఎందుకలా చేశారో సభకు వస్తే అడుగుదామనుకున్నా: రేవంత్

TG: కృష్ణా ప్రాజెక్టులపై రాష్ట్రానికి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఆయన ఎందుకలా చేశారో సభకు వస్తే అడుగుదామనుకున్నా. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా చేశారా? ఎవరైనా తప్పుదోవ పట్టించారా?’ అని ప్రశ్నించారు. ఇక కర్ణాటక నుంచీ జలవివాదాలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీలు ఉన్నప్పటికీ కర్ణాటకపై కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.


