News February 17, 2025

ఎల్లారెడ్డిపేట: ఉరి వేసుకుని వ్యక్తి మృతి

image

ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం బోప్పపూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనుమ కనకయ్య ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 17, 2026

GNT: తెనాలిలో న్యూడ్ వీడియో కాల్స్ (UPDATE)

image

గుంటూరు (D) తెనాలిలో చెంచుపేట కేంద్రంగా న్యూడ్ వీడియో కాల్స్ దందా వెలుగులోకి వచ్చిన <<19645040>>విషయం తెలిసిందే.<<>> ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మహిళలతో న్యూడ్ వీడియో కాల్స్ చేయిస్తున్న వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరిలో ఒకరి కుమారుడు పరారీలో ఉండగా గాలిస్తున్నట్లు పోలీసుల తెలిపారు. లీగల్ ఒపీనియన్‌తో గురువారం రాత్రి సుమోటోగా కేసు నమోదు చేశామన్నారు.

News April 17, 2026

హైదరాబాద్‌లో మరో సైబర్ టవర్!

image

TG: హైదరాబాద్‌లో ఐటీ విప్లవానికి గుర్తుగా నిలిచిన సైబర్ టవర్స్ తరహాలో మరో అత్యాధునిక పరిపాలనా భవనం నిర్మితం కానుంది. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కోసం ఐకానిక్ బిల్డింగ్‌ను 8 అంతస్తుల్లో నిర్మించనున్నారు. దీనికి రూ.200 కోట్లతో ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ఫైలును సీఎం పరిశీలనకు పంపారు. కైత్లాపూర్‌లోని ఐదెకరాల భూమిని అధికారులు ఎంపిక చేశారు.

News April 17, 2026

కోనసీమ: ఒకే విగ్రహం, రెండు రూపాలు!

image

ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ గ్రామంలో శ్రీ మహావిష్ణువు అరుదైన రూపంలో దర్శనమిస్తారు. ఒకే నల్లరాయిపై ముందు వైపు మహావిష్ణువు, వెనుక వైపు స్త్రీ రూపమైన జగన్మోహినిగా ఈ విగ్రహాన్ని మలిచారు. స్వామి పాదాల నుంచి గంగమ్మ నీటి ధారలు నిరంతరం ప్రవహించడం ఇక్కడి విశేషం. ఈ దేవాలయాన్ని సందర్శించిన పర్యాటకులు చాళుక్య శిల్పకళా వైభవాన్ని చూసి పరవశించిపోవడం ఖాయమని భక్తులు చెబుతారు.